Tuesday, January 22, 2013

సీడీల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పాఠాలు

ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రాక్టికల్ పాఠాలను సీడీల్లో పొందుపరిచి అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సీడీలను తెలుగు మీడియంలో రూపొందించారు. ఫిజిక్స్ రెండు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలకు ఒకటి చొప్పున సీడీలు రూపొందించారు. ఒక్కో సీడీ వెలను రూ. 200గా నిర్ణయించారు. కళాశాలలు క్రాస్డ్ డీడీ రూపంలో డబ్బులు చెల్లించి వీటిని పొందవచ్చు. ‘కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడుకేషన్, ఏపీ, హైదరాబాద్’ పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 3న ఓయూ దూరవిద్య బీఈడీ ప్రవేశపరీక్ష

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా బీఈడీ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 3న జరగనుంది. అర్హత గల అభ్యర్థులకు త్వరలో హాల్‌టిక్కెట్లను పోస్టు ద్వారా జారీ చేయనున్నారు. ఓయూ వెబ్‌సైట్లో కూడా హాల్‌టిక్కెట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు డిస్టెన్స్‌మోడ్‌లో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు 945 దరఖాస్తులు అందినట్లు అధికారులు చెప్పారు.

దర్శకులు లిస్ట్‌లో మహేష్‌బాబు ..!

ప్రిన్స్‌ మహేష్‌బాబు అంటే ఇప్పుడు దేశం మొత్తం తెలిసిన బ్రాండ్‌ అంబాసిడర్‌. అందుకేనేమో కోలీవుడ్‌ దర్శకులు మహేష్‌ వెంట పడుతున్నారు. మణిరత్నం, శంకర్‌ ఇద్దరూ మహేష్‌తో ప్రాజెక్టులు చేద్దామనుకుని భంగపడ్డ విషయం విదితమే. ఆ తర్వాత లింగుస్వామి, గౌతమ్‌ మీనన్‌లాంటి క్రియేటివ్‌ దర్శకులు కూడా అప్పట్లో మహేష్‌ కోసం తెగ ట్రై చేశారు. ఇప్పుడు తాజాగా ‘రంగం’ లాంటి సంచలనాత్మక చిత్రాన్ని తీసిన దర్శకుడు కె.వి.ఆనంద్‌ కూడా ఈ తాజా లిస్ట్‌లో ఉన్నాడు . అయినా ప్రిన్స్‌ మహేష్‌బాబుకు ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ ప్రాజెక్టులలో మునిగిపోయి ఉన్నాడు. కొత్తగా కోలీవుడ్‌ దర్శకులకు డేట్స్‌ ఇవ్వాలంటే వాళ్లు మహేష్‌ కోసం మరో రెండు సంవత్సరాలు ఆగాల్సిందే.  ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో’ చిత్రం సంక్రాంతి రేస్‌లో విడుదలకు సిద్ధం కాగా…సుకుమార్‌తో చిత్రం మూడొంతులు పూర్తయింది. ఈ సమ్మర్‌లో క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్‌ అయిన మహేష్‌ ఆ తర్వాత పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో, దిల్‌ రాజు బ్యానర్‌లో మరో చిత్రానికి చేయాల్సి ఉంది.

కోర్టులో లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని సోమవారం ఉదయం  పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. 2005లో పటాన్‌చెరు మండలం ముత్తంగి దగ్గర కలెక్టర్‌ను దూషించిన కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. బెయిల్ కోసం దాఖలు చేసుకున్న అసదుద్దీన్‌ను పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. అసదుద్దీన్‌ను కోర్టుకు తరలించడంతో హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు.

పోలీసులు అదుపులోకి హైదరాబాద్ నగరం

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు రేపు సంగారెడ్డి బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్ పి అదనపు పోలీసు బలగాలను పిలిపించారు.బలవంతంగా షాపులను మూసివేయిస్తున్నారు. బంద్ చేయని దుకాణాలపై రాళ్లతో దాడి చేశారు. పలుచోట్ల దుకాణాదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో పాతబస్తీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతబస్తీలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. హైదరాబాద్ నగరం పూర్తిగా ప్రశాంతంగా ఉందని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. నగరం పూర్తిగా పోలీసుల అదుపులోనే ఉందన్నారు. ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు, రాస్తారోకోలకు ఎటువంటి అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. చిన్నచిన్న ఘటనలు తప్ప మరెటువంటి ఘటనలు జరగలేదని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులను మోహరించామని తెలిపారు.

Monday, January 21, 2013

బాబు రాకతో కృష్ణలో సందడి...


జనం రాకతో పోలిస్తే నా ఆరోగ్య సమస్య పెద్ద విషయం కాదు అంటూ సాగిన ప్రియతమా నాయకుడు మాజీ ముక్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు