Tuesday, January 22, 2013

పోలీసులు అదుపులోకి హైదరాబాద్ నగరం

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు రేపు సంగారెడ్డి బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్ పి అదనపు పోలీసు బలగాలను పిలిపించారు.బలవంతంగా షాపులను మూసివేయిస్తున్నారు. బంద్ చేయని దుకాణాలపై రాళ్లతో దాడి చేశారు. పలుచోట్ల దుకాణాదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో పాతబస్తీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతబస్తీలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. హైదరాబాద్ నగరం పూర్తిగా ప్రశాంతంగా ఉందని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. నగరం పూర్తిగా పోలీసుల అదుపులోనే ఉందన్నారు. ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు, రాస్తారోకోలకు ఎటువంటి అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. చిన్నచిన్న ఘటనలు తప్ప మరెటువంటి ఘటనలు జరగలేదని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులను మోహరించామని తెలిపారు.

No comments:

Post a Comment